కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మలు గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నువ్వు వచ్చేవని ... నీ పిలుపే విని
నువ్వు వచ్చేవని ... నీ పిలుపే విని
కన్నులనీరిడి కలయ చూసితిని
గడియ ఏని ఇక విడిచి పోకుమా
గడియ ఏని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయం పగుల నీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో